పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కల సర్వే త్వరలో ప్రారంభం కానుంది. 2021 జనాభా లెక్కల కోసం 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. జనాభా లెక్కల్లో భాగంగా తాగునీటి వసతి, మరుగుదొడ్డి సదుపాయం, టీవీ, చరవాణి, ద్విచక్రవాహనం, కారు తదితర వివరాలను సేకరించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏప్రిల్ నుంచి జనాభా లెక్కల సర్వే
2021 జనాభా లెక్కల కోసం 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. జనాభా లెక్కల్లో భాగంగా తాగునీటి వసతి, మరుగుదొడ్డి సదుపాయం, టీవీ, చరవాణి, ద్విచక్రవాహనం, కారు తదితర వివరాలను సేకరించనున్నారు.
ఏప్రిల్ నుంచి జనాభా లెక్కల సర్వే
కుటుంబానికి సంబంధించిన మొత్తం 31 వివరాలను ఇంటింటి సర్వేలో సేకరిస్తారు. మరుగుదొడ్డి, మురుగు జలాలు వెళ్ళే మార్గం, వంటగ్యాస్ సదుపాయం, ఇంటర్నెట్, ల్యాప్ టాప్, టెలిఫోన్, వ్యాను, ప్రధానంగా తినే ఆహారం తదితరాలు జనాభా లెక్కల్లో ఉండనున్నాయి. చరవాణి నెంబర్ కూడా తీసుకుంటారు. మొబైల్ నెంబర్ కేవలం జనాభా లెక్కల సమాచార కోసం మాత్రమే వినియోగిస్తారని అందులో పేర్కొన్నారు.
ఇదీ చూడండి :మాత్రలు వికటించి 15 మంది విద్యార్థులకు అస్వస్థత
Last Updated : Feb 11, 2020, 10:19 PM IST