హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌లో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డీసీపీ సుమతి వెల్లడించారు. ద్విచక్రవాహనంపై తిరుగుతూ... చరవాణీలు లాక్కుపోతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు. నిందితులు లక్ష్మీ, రంగారెడ్డి జిల్లా యాప్రాల్‌కు చెందిన నవీన్‌గా పోలీసులు గుర్తించారు. నవీన్‌పై పలు దొంగతనం కేసులు ఉన్నందున పీడీయాక్ట్ నమోదు చేస్తున్నట్లు చెప్పారు. పీఎస్ పరిధిలో మొబైల్స్ పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు ఇచ్చిన 35 మంది బాధితులకు రికవరీ చేసి అందజేసినట్లు వెల్లడించారు. రికవరీకి కృషి చేసిన సిబ్బందిని ఆమె అభినందించారు.
ఎస్‌ఆర్ నగర్‌లో ఇద్దరు చరవాణీ దొంగల అరెస్టు - ఎస్‌ఆర్ నగర్‌లో ఇద్దరు చరవాణీ దొంగల అరెస్టు
ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో... సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 35 మంది బాధితులకు చరవాణీలు అందించారు.
![ఎస్‌ఆర్ నగర్‌లో ఇద్దరు చరవాణీ దొంగల అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4828497-thumbnail-3x2-chori.jpg)
ఎస్‌ఆర్ నగర్‌లో ఇద్దరు చరవాణీ దొంగల అరెస్టు