తెలంగాణ

telangana

ETV Bharat / state

ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల విరాళాలు - Cm kcr latest updates

భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన హైదరాబాద్​లో ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాల కోసం పలువురు ప్రముఖులు సీఎం సహాయనిధికి విరాళాలు అందజేశారు.

ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల విరాళాలు
ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల విరాళాలు

By

Published : Nov 8, 2020, 5:10 AM IST

ఇటీవలి భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం ప్రకటించిన విరాళాలను పలువురు ముఖ్యమంత్రి కేసీఆర్​కు అందించారు. ప్రగతిభవన్​లో సీఎంను కలిసి సంబంధిత చెక్కులను అందజేశారు.

మైహోం గ్రూప్ తరఫున ఆ సంస్థ డైరెక్టర్ రామ్ రూ. 5 కోట్ల చెక్​ను అందించారు. సినీనటులు చిరంజీవి రూ. కోటి, నాగార్జున రూ. 50 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. దక్కన్ సిమెంట్స్ సంస్థ రూ. 25 లక్షల విరాళం అందించింది.

ఇదీ చదవండి:కేంద్రం నుంచి నయాపైసా కూడా సాయం అందలే: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details