PRIME MINISTER MODI Congratulated RRR Team: ఆర్ఆర్ఆర్ సినిమా విశిష్ట పురస్కారం అందుకోవటం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవటం గర్వకారణమని అభినందించారు. కీరవాణి, రాజమౌళితో పాటు చిత్రబృందానికి తన శుభాభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
Venakaiah Naidu : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు కీరవాణికి అభినందనలు తెలిపారు.
CHANDRA BABU NAIDU: అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సైతం అభినందనలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపి.. తాను గతంలో చెప్పినట్లు తెలుగు భాష భారతీయ సాఫ్ట్ పవర్‌గా మారుతోందని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Kishan Reddy: తెలుగు సంగీత కీర్తి పతాకను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడిస్తూ, ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ దక్కించుకోవడం పట్ల చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, చిత్ర దర్శకుడు రాజమౌళి, నటులు రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ తోపాటుగా ఈ చిత్ర యూనిట్ మొత్తానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
RevanthReddy: నాటు నాటు పాటకు అంతర్జాతీయ స్థాయి అవార్డు రావడం గర్వకారణమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు సినిమా స్థాయి ప్రపంచం గుర్తించే విధంగా ఎదిగినందుకు ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాతలకు, దర్శకులకు, పాట రచయితకు, గాయకులకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు - నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై చిత్రం యూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పారు.
Nara Lokesh: ఆర్ఆర్ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం గర్వకారణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: