Politicians tribute to Super Star Krishna : చిరునవ్వుతో పలకరించే సూపర్‌స్టార్ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని సినీ, రాజకీయ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Governor Tamilisai tribute to Super Star Krishna : లెజెండరీ నటుడు కృష్ణ పార్థివదేహానికి తెలంగాణ గవర్నర్ తమిళ సౌందరాజన్ నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోస్‌కు చేరుకున్న ఆమె పుష్పాంజలి ఘటించారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం నిజంగా షాక్‌కు గురి చేసిందన్నారు. తన నటనతో అశేష ప్రేక్షకులను అలరించారని చెప్పారు. సినీ పరిశ్రమకు కృష్ణ చేసిన సేవలు మరువలేమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
పద్మాలయ స్టూడియోలో కృష్ణ పార్థివదేహానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులర్పించారు. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంత్యక్రియల ఏర్పాట్లు అక్కడే ఉండి చూసుకుంటున్నారు. సాయంత్రం మ. 3 గం.కు అంతిమయాత్ర, సా. 4 గం.కు మహప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.
AP CM JAGAN TRIBUTES TO KRISHNA : ఏపీ ముఖ్యమంత్రి జగన్ బుర్రిపాలెం బుల్లోడు కృష్ణ పార్థివదేహాన్ని సందర్శించారు. పూలమాలలతో భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయనతో పాటు మంత్రి గోపాలకృష్ణ, ఎంపీ భరత్.. నటశేఖరుడికి అంజలి ఘటించారు. అనంతరం కృష్ణ కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్.. ధైర్యంగా ఉండాలంటూ వారిని వెన్నుతట్టి ఓదార్చారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.