తెలంగాణ

telangana

ETV Bharat / state

మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు తేజం.. స్వగ్రామంలో అంబరాన్నంటిన సంబురం - అరుణ మిల్లర్​ స్వగ్రామం వెంట్రప్రగడ

ARUNA MILLER : అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా భారత సంతతి మహిళ అరుణ మిల్లర్ ఎన్నికైన వేళ.. ఆమె సొంతూరు కృష్ణా జిల్లా వెంట్రప్రగడలో ఆనందోత్సాహలు మిన్నంటాయి. అగ్రరాజ్యంలోని ఓ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమ గ్రామానికి చెందిన మహిళ ఎన్నిక కావటంపై గ్రామస్థులు , బంధువులు హర్షం వ్యక్తం చేశారు.

ARUNA MILLER
ARUNA MILLER

By

Published : Nov 10, 2022, 11:18 AM IST

MERYLAND Lt Governor ARUNA MILLER : అమెరికాలోని మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన భారత సంతతి మహిళ అరుణ మిల్లర్‌ అసలు పేరు కాట్రగడ్డ అరుణ. ఆమె తండ్రి కాట్రగడ్డ వెంకటరామారావు ఐబీఎం సంస్థలో పనిచేశారు. 1972లోనే వీరి కుటుంబం అమెరికా వెళ్లి స్థిరపడింది. అమెరికాలోని మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అరుణ.. 1990లో అమెరికాకు చెందిన డేవిడ్ మిల్లర్‌ను వివాహం చేసుకున్నారు. అరుణమిల్లర్‌ డెమోక్రటిక్‌ పార్టీ సభ్యురాలిగా చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు. అంచెలంచెలుగా ఎదిగి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కావడంతో.. సొంతూరిలో బంధువులు, గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు.

మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు తేజం అరుణ మిల్లర్

అరుణ చిన్నాన్న కాట్రగడ్డ నాగేశ్వరరావు కుటుంబం.. వెంట్రప్రగడలోని పూర్వీకుల ఇంట్లోనే ఇప్పటికీ నివసిస్తోంది. పొరుగుదేశంలో తెలుగు కీర్తిపతాకను అరుణ ఎగురవేశారని ఆమె బంధువులు వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఏడాదికోసారైనా అరుణ సొంతూరికి వస్తుంటారని తెలిపారు. అగ్రదేశంలో కీలకమైన రాష్ట్రానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అరుణ మిల్లర్‌ ఎన్నికవడం తమ గ్రామానికే గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు.

భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎంపికైన తరుణంలోనే అగ్రరాజ్యం అమెరికాలోనూ ఓ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ గా అరుణా కాట్రగడ్డ ఎన్నికై తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపచేశారని.. వెంట్రప్రగడ గ్రామస్థులు వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details