తెలంగాణ

telangana

ETV Bharat / state

మిత్రులు, అభిమానుల మధ్య ఘనంగా సిరాజ్ పుట్టిన రోజు వేడుకలు - siraj birthday celebrations news

భారత క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పుట్టినరోజు వేడుకలు ఈ నెల 13న.. నగర శివారులో ఘనంగా జరిగాయి. మిత్రులు, అభిమానుల సమక్షంలో హైదరాబాద్‌ ఆటగాడు వేడుకలు జరుపుకున్నారు.

mohmad siraj birthday celebrations
ఘనంగా సిరాజ్ పుట్టిన రోజు వేడుకలు

By

Published : Mar 16, 2021, 3:47 PM IST

భారత క్రికెట్‌ జట్టు ఆటగాడు మహ్మద్‌ సిరాజ్‌ పుట్టిన రోజు వేడుకలు ఈ నెల 13న.. నగర శివారులో వైభవంగా జరిగాయి. 27 వసంతాలు పూర్తి చేసుకున్న సిరాజ్.. తన జన్మదిన వేడుకల్లో సందడి చేశారు. మిత్రులు, అభిమానులతో కలిసి నృత్యాలు చేశారు.

సిరాజ్‌ జన్మదినం సందర్బంగా టీమ్‌ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ట్విట్టర్ వేదికగా హైదరాబాదీ క్రికెటర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి: నిజామాబాద్‌లో పసుపు బోర్డు అవసరం లేదు: కేంద్రం

ABOUT THE AUTHOR

...view details