హైదరాబాద్ ఉప్పల్‌లోని సీడీఎఫ్‌డీ ఉన్నతాధికారిపై సహోద్యోగి కత్తితో దాడి చేశాడు. ఏవో వెంకటేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ శర్మ మధ్య గత కొంత కాలంగా వివాదం జరుగుతుంది. తనకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక ఇచ్చాడనే నెపంతో శర్మ ఏవోపై కక్ష పెంచుకున్నాడు. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో వెంటేశ్వర రావుతో శర్మ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి... శర్మ కత్తితో దాడి చేశాడు. గాయపడ్డ వెంకటేశ్వరరావును ఉప్పల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
సీడీఎఫ్‌డీ ఉన్నతాధికారిపై తోటి ఉద్యోగి దాడి - సీడీఎఫ్‌డీ ఉన్నతాధికారిపై దాడి
తనకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక ఇచ్చారంటూ సీడీఎఫ్‌డీ ఏవో వెంకటేశ్వరరావుపై అదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోన్న శర్మ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఉప్పల్‌లో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
![సీడీఎఫ్‌డీ ఉన్నతాధికారిపై తోటి ఉద్యోగి దాడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3946531-thumbnail-3x2-cdfdgupta.jpg)
కత్తితో దాడి