కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశంలో అమలు చేసిన లాక్‌డౌన్ మంచి ఫలితాన్నే ఇచ్చిందని, దశల వారీగా లాక్‌డౌన్‌ను సడలిస్తున్న తరుణంలో మరింత అప్రమత్తత అవసరమని వ్యాధి నియంత్రణ-నివారణ కేంద్రం(సీడీసీ), అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్‌ఏఐడీ) భారతీయ ప్రతినిధులు పేర్కొన్నారు. వైరస్ మరోదఫా ప్రకోపించే(రీ బౌన్స్ అయ్యే) ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. సడలింపుల తర్వాత పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూ నిర్ధరణ పరీక్షలను పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. వైరస్‌పై భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి అమెరికా సంపూర్ణ మద్దతు ఇస్తోందని భారత్‌లో సీడీసీ మిషన్ డైరెక్టర్ డాక్టర్ మేఘనా దేశాయ్, యూఎస్‌ఏఐడీ డైరెక్టర్ రామోన్ ఎల్ హమ్జౌయి వివరించారు.
60 దేశాల్లో పరిశోధనలు
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ రూపొందించే విషయంలో ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాలు విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్నాయి. టీకా త్వరలో వస్తుందన్న ఆశాభావంతో ఆయా దేశాలు ఉన్నాయి. భారతదేశంలో వివిధ సంస్థలు చేస్తున్న పరిశోధనలకు అమెరికా సహకారాన్ని అందిస్తోంది.
ఇప్పుడే అసలు పరీక్ష