తెలంగాణ

telangana

ETV Bharat / state

నగరమంతా నిఘా నేత్రాలు... ఇక ఉండవు నేరాలు... - CCTV_INSTALATION_IN_HYDERABAD

ఒక్క సీసీటీవీ కెమెరా పది మంది కానిస్టేబుల్స్​తో సమానం... అంటూ నగర పోలీసులు పదేపదే చెబుతున్నారు. అలాంటి నిఘా నేత్రాలతో నేరగాళ్లను ఇట్టే పసిగడుతున్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ... అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. వీటి వల్ల నేరాలు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ సీసీ కెమెరాల నిర్వహణ మాత్రం సరిగా లేదని స్థానికులు వాపోతున్నారు.

CCTV_INSTALATION_IN_HYDERABAD

By

Published : Aug 14, 2019, 6:15 AM IST

Updated : Aug 14, 2019, 1:27 PM IST

నగరమంతా నిఘా నేత్రాలు... ఇక ఉండవు నేరాలు...
జేబు దొంగతనాల నుంచి హత్యల వరకు ఎలాంటి నేరం జరిగినా నిందితుల వేటలో పోలీసులకు సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారుతున్నాయి. సంక్లిష్టమైన కేసులను కూడా సీసీటీవీ చిత్రాల ద్వారా పోలీసులు సకాలంలోనే ఛేదిస్తున్నారు. గత కొన్నేళ్ళుగా నగరంలో అన్ని కాలనీల్లో కమ్యూనిటీ సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలంటూ పోలీసులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే 6 లక్షలకు పైగా ఏర్పాటు చేసిన సీసీటీవీల సంఖ్యను ఒక మిలియన్​కు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ వెల్లడించారు.

నివాస ప్రాంతాలు, వాణిజ్య సంస్థలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలను పదుల సంఖ్యలో అమర్చాలని నగర పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో పదివేలు, సైబరాబాద్‌లో ఐదువేల కెమెరాలతో పాటు ట్రాఫిక్‌ వ్యవస్థకు ఉపయోగిస్తున్న హెచ్‌ట్రిమ్స్‌ కెమెరాలను అమర్చాలని నిర్ణయించారు. ఏడాది పాటు ప్రభుత్వ పరంగా కెమెరాలను ఏర్పాటు చేస్తూ... మరో పక్క వాణిజ్య సంస్థలు, వ్యాపారులు, ప్రైవేటు సంస్థలను ఈ క్రతువులో భాగస్వాములను చేయాలని భావించారు.

సైబరాబాద్ ఐటీ కారిడార్ ఇప్పటివరకూ 60 వేల సీసీటీవీలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ అందుబాటులోకి వస్తే ఒకే సారి 10 వేల కెమెరాలను తెరపై చూసే అవకాశం ఉందని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో కెమెరాలకు సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా ఐటీ బృందం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

వ్యాపారస్థులు, నివాసముంటున్న వారి భాగస్వామ్యంతో పోలీసులు సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తున్నా... వాటి నిర్వహణ మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. నగరంలో ప్రధాన ప్రాంతాలైన బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్​... లాంటి ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన నిఘానేత్రాలు నేలచూపులు చూస్తున్నాయి. పోలీసుల సూచనల మేరకు కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం వల్ల నేరాలు, దొంగతనాలు చాలా వరకు తగ్గినా... ప్రస్తుతం వాటి పరిస్థితి దారుణంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.

ఇవీ చూడండి: ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన రాష్ట్రపతి

Last Updated : Aug 14, 2019, 1:27 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details