road accident in CCTV footage: నిత్యం రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా, వాహనదారుల్లో అలసత్వం కనిపిస్తూనే ఉంది. రోడ్డుపై వెళ్తూ విన్యాసాలు చేయడం, వాహనాలను దాటాలనే ఉత్సాహంతో వేగాన్ని పెంచి నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు కారకులు అవుతున్నారు. ఇతరుల జీవితలను సైతం ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఏపీలోని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద చోటుచేసుకుంది.
వాహనాలను దాటాలనే ఉత్సాహంతో వేగాన్ని పెంచి.. చివరకు.. - ap latest news
road accident in CCTV footage: రోడ్డుపై వెళ్తూ విన్యాసాలు చేయడం, వాహనాలను దాటాలనే ఉత్సాహంతో వేగాన్ని పెంచి నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు కారకులవుతున్నారు. గొబ్బూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనదారుడు, బొలెరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ, డివైడర్‌ను ఢీ కొట్టాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
రోడ్డు ప్రమాదం
ముందు వెళుతున్న బొలెరో వాహనాన్ని అధిగమించబోయి పక్కన ఉన్న డివైడర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముందు వెళుతున్న మరో ద్విచక్ర వాహనదారుడు సైతం తీవ్ర గాయాలపాలైయ్యాడు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదం విజువల్స్ సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
ఇవీ చదవండి: