కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌పై ఇతర రాష్ట్రాల్లోనూ నమోదైన కేసులపై ఆ సంస్థ ఛైర్మన్ పార్థసారథిని సీసీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల కస్టడీలో భాగంగా పార్థసారథిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతను చేసిన మోసాలపై కూపీ లాగుతున్నారు. కర్నాటక, పంజాబ్, దిల్లీలోనూ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్.. దాని అనుబంధ సంస్థలైన కార్వీ రియాల్టీ, కార్వీ వెల్త్ సంస్థలపై కేసులు నమోదయ్యాయి. పార్థసారథిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారన్న విషయం తెలుసుకున్న ఆయా రాష్ట్రాల పోలీసులు, కేసు వివరాలు తెలుసుకునేందుకు సీసీఎస్ పోలీసులను సంప్రదించారు.
KARVY MD PARTHASARATHI: కార్వీ సంస్థ ఎండీ పార్థసారథిని ప్రశ్నిస్తున్న సీసీఎస్ పోలీసులు - telangana top news
కార్వీ సంస్థ ఎండీ పార్థసారథిపై ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి. ఆ విషయాలపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఎండీ పార్థసారథిని ప్రశ్నిస్తున్నారు. అతను చేసిన మోసాల గురించి కూపీ లాగుతున్నారు.
బెంగళూరులోని బసవనగుడి పోలీసులు కార్వీ రియాల్టీ సంస్థపై రెండేళ్ల క్రితం కేసు నమోదు చేశారు. అధిక లాభాలు ఇస్తామని ఆశచూపించి 4 కోట్లకు పైగా రూపాయలు మదుపు చేయించి మోసం చేసిన కేసులో పార్థసారథితో సహా 13మందిపై కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ పోలీసులు సైతం సీసీఎస్ పోలీసులను ఫోన్‌లో సంప్రదించి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని రాష్ట్రాల్లో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ మోసాలకు పాల్పడిందనే విషయాలను పార్థసారథి వద్ద ప్రస్తావించామని... అతను సరైన సమాధానం చెప్పడం లేదని సీసీఎస్ పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:karvy MD arrest: కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండీ పార్థసారథి అరెస్టు