హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇవాళ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన గణేశ్, హైదరాబాద్ కొత్తపేటకు చెందిన శ్రీధర్, కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన శరత్ గతంలో పలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లొచ్చారు. అయినా తీరు మార్చుకోలేని వారు తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఘట్కేసర్, మేడిపల్లి, భువనగిరి, తిరుపతిలో 7 ఇళ్లలో దొంగతనాలు చేశారు. వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు పట్టుపడ్డారు. మరొకరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 18 తులాల బంగారు, 2 కేజీల వెండితోపాటు ఎల్ఈడీ టీవీని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు సీసీఎస్ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.
దొంగల ముఠాను అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు - ccs
తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 7 లక్షల విలువ చేసే వెండి, బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు