ఏపీ, కృష్ణపట్నం ఆనందయ్య మందు.. 18 రకాల మూలిక మిశ్రమాలతో తయారైన గుణాత్మకమైన మందేననే ఆయుష్ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. కానీ దీనికి శాస్త్ర ప్రామాణికత మాత్రం ఇంకా లేదు. 'ది సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చిఇన్ ఆయుర్వేదిక్ సైన్‌సెస్' పరిశీలనలో ఇది తేలనుంది.
ప్రాణాంతకమైన కరోనా వైరస్ నుంచి బయటపడేందుకు.. ఆనందయ్య ఉచిత మందును వాడాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన చాలా మందికి ఆయుష్ తాజా ప్రకటన మరింత బలాన్ని చేకూర్చినట్లు అయింది. నాలుగైదు రోజుల్లో 'ది సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చిఇన్ ఆయుర్వదిక్ సైన్‌సెస్' ( సీసీఆర్‌ఏఎస్) ఆనందయ్య మందులో మూలిక గుణాలను విశ్లేషించి సమగ్ర నివేదికను ఇవ్వనుంది. ఇందుకోసం రాష్ట్రంలోని ఆయుర్వేద కళాశాలలు, అందులోని అధ్యాపకులు, విద్యార్థుల సహకారం కూడా సీసీఆర్ఏఎస్ తీసుకుంటోంది.