తెలంగాణ

telangana

ETV Bharat / state

Covid Fourth Wave : నాలుగో దశ భయం వద్దు.. కానీ..! - Telangana corona cases

Covid Fourth Wave : ఇటీవల కొవిడ్​ కేసుల్లో పెరుగుదల కన్పిస్తోంది. పెరుగుతున్న కేసులను చూస్తుంటే నాలుగో దశ మొదలైందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఒమిక్రాన్‌ ఉప రకాలే వ్యాప్తిలో ఉన్నాయని, వీటిలో ఆందోళన కలిగించే మార్పులేవీ గుర్తించలేదని సీసీఎంబీ సలహాదారు రాకేశ్‌మిశ్రా, శాస్త్రవేత్త వినయ్‌కుమార్‌ తెలిపారు.

Covid Fourth Wave: నాలుగో దశ భయం వద్దు.. కానీ..!
Covid Fourth Wave: నాలుగో దశ భయం వద్దు.. కానీ..!

By

Published : May 2, 2022, 8:52 AM IST

Covid Fourth Wave : దేశంలో కొవిడ్‌ నాలుగో దశ మొదలైందా? కొత్తగా నమోదవుతున్న కేసుల్లో పెరుగుదల, వారం రోజుల సగటు పరిశీలిస్తే అవుననే అన్పిస్తుంది. ఏప్రిల్‌ 16న వారం రోజుల సగటు 975 కేసులతో కనిష్ఠానికి పడిపోగా, తర్వాత రెండు వారాల్లోనే సగటు 3వేల కేసులకు పెరిగింది. ఇది నిలకడగా కొనసాగుతుందా లేక పెరుగుతుందా?.. అనేది రోగ నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుందని సీసీఎంబీ సలహాదారు రాకేశ్‌మిశ్రా, శాస్త్రవేత్త వినయ్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ఒమిక్రాన్‌ ఉప రకాలే వ్యాప్తిలో ఉన్నాయని, వీటిలో ఆందోళన కలిగించే మార్పులేవీ గుర్తించలేదని తెలిపారు.

* వైరస్‌లో కొత్త ఉత్పరివర్తనాలు వస్తుంటాయి. ఆర్‌ఎన్‌ఏ వైరస్‌లో ఇది సర్వసాధారణం. ఇందులోని అన్నీ ఉత్పరివర్తనాలు ప్రమాదం కావు. వైరస్‌ జన్యుక్రమ పరిశోధనలో కొత్తగా రీ-కాంబినెంట్‌ వేరియంట్లు కనుగొన్నారని, ఇవి అధిక వ్యాప్తికి దారితీస్తున్నట్లు కన్పించలేదని ఇన్సాకాగ్‌ తెలిపింది. దిల్లీలో ఒమిక్రాన్‌ ఉపరకమైన బి.ఏ.2.12.1 గుర్తించినట్లు పేర్కొంది.

* ప్రస్తుతం కేసులు పెరుగుతున్న చోట బి.ఏ.2.12; బి.ఎ.2.12.1 రకాలే కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్‌ రోగనిరోధక శక్తిని ఏమార్చగలదని మూడో దశ నిర్ధారించింది. అప్పటికే కొవిడ్‌ బారిన పడి, టీకా రెండు డోసులు వేసుకున్నా ఈ వైరస్‌ ప్రభావానికి గురయ్యారు. అయితే ప్రస్తుతం కేసులు పెరుగుతున్న చోట తీవ్రమైన లక్షణాలు, ఆసుపత్రిలో చేరడం వంటి పరిస్థితులు లేవని, అయినా నాలుగో దశను ముందుగా గుర్తించేందుకు మురుగునీటి నమూనాలపై సీసీఎంబీ పరిశోధనలు చేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేసుల పెరుగుదల తీరు నాలుగైదురోజుల ముందే తెలుసుకోవచ్చంటున్నారు.

బూస్టర్‌ డోసు తీసుకోవడం మేలు: 'కరోనా నాలుగో దశ గురించి ఆందోళన అవసరం లేదు. ఇది కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుందని అంచనా. సాధారణంగా రోజులు గడిచే కొద్దీ శరీరంలో యాంటీబాడీలు తగ్గిపోతాయి. అందువల్ల బూస్టర్‌ డోసు తీసుకోవడం మేలు చేస్తుంది. రెండో డోసు తర్వాత బూస్టర్‌కు ప్రభుత్వం 9 నెలల గడువు ప్రభుత్వం నిర్దేశించింది. ఇది 6 నెలలకు తగ్గించాలి. 60 ఏళ్ల వయసు వారే కాక అందరూ బూస్టర్‌ డోసు తీసుకోవడం మేలు.'

- డాక్టర్‌ రాకేశ్‌మిశ్ర, సలహాదారు, సీసీఎంబీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details