కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్లే కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆరో వార్షిక సదస్సులో పాల్గొన్న ఆయన.. అనుకున్న స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ సాగడం లేదని అభిప్రాయపడ్డారు.
'అనుకున్న స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ సాగడం లేదు' - Rakesh Kumar Mishra news today
కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆరో వార్షికోత్సవానికి సీసీఎంబీ డైరెక్టర్ హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలు పాటించనందునే మళ్లీ కేసులు పెరుగుతున్నాయని ఆయన... కరోనా టీకాపై మరింత అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని టీకాలు సురక్షితమని, యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నాయని భరోసా ఇచ్చారు.
'కొవిడ్ నిబంధనలు పాటించనందనే మళ్లీ కేసులు'
కొవిడ్ టీకాపై మరింత అవగాహన కల్పించాలని సీసీఎంబీ డైరెక్టర్ సూచించారు. కరోనాను ఎదుర్కొనేందుకు టీకా అవసరమని పునరుద్ఘాటించారు. రెండో డోస్ తీసుకున్న 14 రోజులకు యాంటీబాడీలు ఉత్పత్తి ప్రారంభం అవుతాయన్న రాకేశ్ మిశ్రా.. 20-30 శాతం మందిలో తొలిడోస్ తీసుకున్నప్పటి నుంచే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని తెలిపారు. అన్ని టీకాలు సురక్షితమైనవని పేర్కొన్న ఆయన.. అన్ని వ్యాక్సిన్లు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నాయని వివరించారు.
Last Updated : Mar 13, 2021, 5:13 PM IST