ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

రానున్నవి ఆర్‌ఎన్‌ఏ టీకాలు: సీసీఎంబీ డైరక్టర్ - The latest news on RNA vaccines

అటల్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రంలో సీసీఎంబీ పరిశోధనలు ప్రారంభించింది. తాజాగా అందుబాటులోకి ఆర్‌ఎన్‌ఏ థెరప్యూటిక్స్‌, వాక్సిన్‌ ఫ్లాట్‌ఫాంను నెలకొల్పింది. కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనే టీకాల అభివృద్ధి ప్రస్తుతం ప్రాధాన్యం కావడంతో ఆర్‌ఎన్‌ఏ ఆధారిత టీకా అభివృద్ధిపై పరిశోధనలు చేపట్టినట్లు సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌మిశ్ర తెలిపారు.

రానున్నవి ఆర్‌ఎన్‌ఏ టీకాలు: సీసీఎంబీ డైరక్టర్
రానున్నవి ఆర్‌ఎన్‌ఏ టీకాలు: సీసీఎంబీ డైరక్టర్
author img

By

Published : Feb 8, 2021, 6:57 AM IST

జన్యుపరంగా అరుదైన రుగ్మతల చికిత్సకు, కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోడానికి ఆర్‌ఎన్‌ఏ ఆధారిత టీకాల అభివృద్ధి కోసం సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) ఒక కొత్త సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. సీసీఎంబీకి అనుబంధంగా ఉన్న అటల్‌ ఇక్యుబేషన్‌ కేంద్రంలో 'ఆర్‌ఎన్‌ఏ థెరప్యూటిక్స్‌, వాక్సిన్‌ ఫ్లాట్‌ఫాం'ను ఈ నెలలో నెలకొల్పింది.

కొవిడ్‌తోపాటు అరుదైన జన్యువ్యాధులు దేశంలో ప్రజారోగ్య సమస్యగా మారుతున్నందున పరిశోధనలకు మరింత దన్నుగా ఉండేలా దీర్ఘకాల దృష్టితో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌మిశ్ర 'ఈనాడు- ఈటీవీ భారత్​'కు తెలిపారు. కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనే టీకాల అభివృద్ధి ప్రస్తుతం ప్రాధాన్యం కావడంతో ఆర్‌ఎన్‌ఏ ఆధారిత టీకా అభివృద్ధిపై పరిశోధనలు చేపట్టినట్లు చెప్పారు.

నాలుగు దశల్లో...

  1. ఆర్‌ఎన్‌ఏ ఆధారిత టీకా అభివృద్ధిపై పరిశోధనలు నాలుగు దశల్లో ఉంటాయి. మొదట వైరస్‌ జన్యువు రూపకల్పన చేస్తారు. ఇదివరకులా పెద్ద సంఖ్యలో ల్యాబ్‌లో వైరస్‌లను పెంచాల్సిన అవసరం ఉండదు. దీన్నుంచి డీఎన్‌ఏ టెంప్లెట్‌ను ఉత్పత్తి చేస్తారు.
  2. రెండో దశలో డీఎన్‌ఏను ఆర్‌ఎన్‌ఏగా మారుస్తారు. దీని ఆధారంగా టీకా అభివృద్ధి చేస్తారు.
  3. మూడో దశలో నూనె బిందువుగా మారిన ఆర్‌ఎన్‌ఏ బయటికి వస్తుంది.
  4. లిపిడ్‌ నానో పార్టికల్స్‌(ఎల్‌ఎన్‌పీ) అని పిలిచే దానిని నాలుగో దశలో జంతువులపై ప్రయోగిస్తారు. ఆశించిన ఫలితాన్ని ఇస్తుందా లేదా అని తనిఖీ చేస్తారు. నెలల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.

మూడు నెలల్లో..

'ఇప్పటికే పరిశోధనలు మొదలుపెట్టాం. ఏ దశలో ఉందో ఇప్పుడే చెప్పడం కష్టం. మూడు నెలల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని భాగస్వామ్య సంస్థలకు అప్పగించే దశలో ఉంటాం' అని డాక్టర్‌ రాకేశ్‌మిశ్ర విశ్వాసం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details