తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీసీఎంబీ వైరస్‌ నమూనాలను ఐసోలేట్‌ చేయగలుగుతోంది'

వైరల్‌ కల్చల్‌ వాడుకుంటూ సీసీఎంబీ ఇప్పుడు వివిధ ప్రాంతాల వైరస్ నమూనాలను ఐసోలేట్ చేయగలుగుతోందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా పేర్కొన్నారు. ఇలాంటి విధానాల నమూనాలను అనేక పరిశోధనా సంస్థలతో పాటు ప్రైవేట్ కంపెనీల్లోనూ వాడటం ద్వారా కరోనాపై పోరాటానికి ఉపయోగకరమైన వనరులు తయారవుతాయన్నారు.

ccmb director doctor rakesh mishra on corona virus vaccine development
'సీసీఎంబీ వైరస్‌ నమూనాలను ఐసోలేట్‌ చేయగలుగుతోంది'

By

Published : May 29, 2020, 9:46 AM IST

Updated : May 29, 2020, 10:35 AM IST

కరోనా వైరస్ పెరగడానికి వైరల్ కల్చర్ వాడుకుంటూ సీసీఎంబీ ఇప్పుడు వివిధ ప్రాంతాల వైరస్ నమూనాలను ఐసోలేట్ చేయగలుగుతోందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా పేర్కొన్నారు. నిర్వీర్యం చేయగల, వాక్సిన్ అభివృద్ధిలో వాడగల వైరస్‌లను పెద్ద మొత్తాల్లో ఉత్పత్తి చేయటానికి కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అవి వైద్య చికిత్సలో పనికొచ్చే యాంటీబాడీలను తయారు చేస్తాయన్నారు.

వైరల్ కల్చర్ వాడుకుంటూ డీఆర్‌డీవో లాంటి ఇతర భాగస్వాములతో కలిసి ఔషధాలను పరీక్షిస్తున్నట్టు రాకేశ్ మిశ్రా వివరించారు. అలాంటి విధానాల నమూనాలను అనేక పరిశోధనా సంస్థలతో పాటు ప్రైవేట్ కంపెనీల్లోనూ వాడటం ద్వారా కరోనాపై పోరాటానికి ఉపయోగకరమైన వనరులు తయారవుతాయన్నారు. భవిష్యత్తులో సంసిద్ధతకూ దోహదం చేస్తాయని మిశ్రా తెలిపారు.

'సీసీఎంబీ వైరస్‌ నమూనాలను ఐసోలేట్‌ చేయగలుగుతోంది'

ఇదీచూడండి: కరోనా టీకాకు 2 నెలల్లో ఓ రూపు

Last Updated : May 29, 2020, 10:35 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details