సీసీఎంబీ శాస్త్రవేత్తలు పూర్తి దేశీయంగా మెసెంజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) టీకా సాంకేతికతను తొలిసారి అభివృద్ధి చేశారు. ఈ మేరకు సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి, అటల్ ఇంక్యూబేషన్ సెంటర్ సీఈవో డాక్టర్ మధుసూదన్ రావు సీసీఎంబీలో మాట్లాడారు. దాదాపు 8 నెలల క్రితం చేపట్టిన ప్రయోగంలో భాగంగా ఇప్పటికే ఎంఆర్ఎన్ఏ సాంకేతికతను వృద్ధి చేయడంతో పాటు సార్స్ కొవిడ్-2ని నియంత్రించే విధంగా ఎంఆర్ఎన్ఏ టీకా క్యాండిడేట్ని రూపొందించినట్లు వివరించారు.
ఈ టీకాను మైస్లపై ప్రయోగించగా.. సత్ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్న సంస్థలకు ఎంఆర్ఎన్ఏ టీకాలను వృద్ధి చేసేందుకు కావాల్సిన సహకారం అందిస్తామని వారు స్పష్టం చేశారు.