తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీజీఎస్‌ను వాడుకోండి... అన్న క్యాంటీన్లు తెరవండి' - ఆర్టీజీఎస్‌ను వాడుకోండి... అన్న క్యాంటీన్లు తెరవండి

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లే.. ఆర్టీజీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు.

CBN LETTER TO CM JAGAN FOR RTGS
ఆర్టీజీఎస్‌ను వాడుకోండి... అన్న క్యాంటీన్లు తెరవండి

By

Published : Apr 9, 2020, 10:26 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమాను పునరుద్ధరించాలని... పంటలకు మద్దతు ధర, ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏపీ సీఎం జగన్​కు చంద్రబాబు లేఖ రాశారు. ప్రతి పేద కుటుంబానికి రూ.ఐదువేలు చొప్పున ఆర్థికసాయం చేయాలని కోరారు. విధ్వంసం చేసేవారు చరిత్ర గతిలో కనుమరుగవుతారన్న తెదేపా అధినేత.. ఇకనైనా రాష్ట్రంలో విధ్వంసానికి స్వస్తి చెప్పాలని పేర్కొన్నారు.

వ్యవస్థ నిర్మాణం, వాటి బలోపేతంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లే.. ఆర్టీజీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని లేఖలో సూచించారు.

ఇవీ చదవండి:కోయలేక.. కోసినా అమ్మలేక.. చ'మిర్చి'న రైతు కళ్లు!

ABOUT THE AUTHOR

...view details