తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యుడు సుధాకర్‌ కేసులో రికార్డులు పరిశీలించిన సీబీఐ - doctor sudhakar case news

వైద్యుడు సుధాకర్ కేసు విషయమై ఆంధ్రప్రదేశ్​ విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిని సీబీఐ అధికారులు సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు.

SUDHAKAR
వైద్యుడు సుధాకర్‌ కేసులో రికార్డులు పరిశీలించిన సీబీఐ

By

Published : Jun 27, 2020, 7:58 AM IST

మత్తు వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ అధికారులు మరోసారి నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలోని కీలకమైన రికార్డులను పరిశీలించారు. ఇదే ఆస్పత్రిలో మత్తు వైద్యునిగా పనిచేసిన సుధాకర్‌...కరోనా రక్షణ కవచాలు లేవంటూ బాహాటంగా విమర్శించడంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఏపీలోని విశాఖలో చోటుచేసుకున్న పరిణామాల అనంతరం ఆయన్ను మానసిక వైద్యశాలకు తరలించగా...హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. అందులో భాగంగానే సీబీఐ అధికారులు రికార్డులు పరిశీలించారు

ABOUT THE AUTHOR

...view details