రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెజస అధ్యక్షుడు ఆచార్య కొదండరాం అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రక్షణ లేకపోవడం దారుణమన్నారు. ఈ హత్య ఒక వ్యక్తి చేసింది కాదని... వాస్తవాలు బయటికి రావాలంటే సీబీఐతో విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. విజయారెడ్డి నివాసానికి వెళ్లిన కొదండరాం... ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.
విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి: కోదండరాం - kodandaram talks on vijayareddy murder
తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. ఆమె భౌతిక కాయానికి నివాళులర్పిచారు. ఈ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
![విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి: కోదండరాం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4962517-428-4962517-1572904702631.jpg)
విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి: కోదండరామ్
స్థానిక అధికార పార్టీ నాయకులే పనిచేయకుండా అడ్డుకున్నారని విజయారెడ్డి తనకు చెప్పినట్లు మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు.
విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి: కోదండరాం
ఇదీ చూడండి: నిందితుడిని ఉపేక్షించేది లేదు: సత్యవతి రాఠోడ్