CBI to investigate Kavita in Delhi liquor scam: ఎమ్మెల్సీ కవిత ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. రేపు కవిత స్టేట్‌మెంట్‌ను సీబీఐ తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే.. కవిత... ప్రగతిభవన్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్‌తో ఈ విషయమై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న దిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ప్రమేయం ఉందని సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు నోటీసులు సైతం జారీ చేసింది. 6వ తేదీన విచారణకు రావాలని ఆదేశించారు.
Delhi liquor scam updates: అయితే దీనిపై స్పందించిన కవిత.. సీబీఐకు లేఖ రాశారు. ఈ నెల 11, 12, 14, 15వ అందుబాటులో ఉంటానని వెల్లడించారు. దీనిపై స్పందించిన సీబీఐ ఈ నెల 11న విచారణ జరిపేందుకు అంగీకరించింది. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు వాంగ్మూలం నమోదు చేస్తామని అధికారులు రిప్లై ఇచ్చారు. దీంతో రేపు సీబీఐ అధికారులు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని ఆమె నివాసంలోనే కవితను ప్రశ్నించనున్నారు.