ED chargesheet against Sameer Mahendru: ఛార్జిషీట్లో ఈడీ పేర్కొన్న నిందితులు.. సమీర్ మహేంద్రు, ఆయనకు చెందిన నాలుగు మద్యం సరఫరా తయారీ సంస్థలకు సమన్లు జారీ చేసింది. ఛార్జిషీట్లో పేర్కొన్న అంశాలపై తమ అభిప్రాయాలను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో సమీర్ మహేంద్రు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందని కోర్టు తెలిపింది. విచారణ జనవరి 3కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
సమీర్ మహేంద్రుపై ఈడీ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ ప్రత్యేక కోర్టు - ED filed chargesheet against Sameer Mahendru
ED chargesheet against Sameer Mahendru: దిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి సమీర్ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు తెలిపింది. మూడు వేలపేజీలతో కూడిన మొదటి ఛార్జ్‌షీట్‌ను ఈడీ నవంబర్ 26న దాఖలు చేసింది. ఛార్జిషీట్లోని అంశాలను పరిశీలించిన కోర్టు వాటిని పరిగణలోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది.
దిల్లీ లిక్కర్ స్కామ్
ఈ కేసులో ఏడుగురిని నిందితులుగా చేరుస్తూ 10వేల పేజీలతో కూడిన సీబీఐ దాఖలు చేసిన మొదటి ఛార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలిపింది. అందులో పేర్కొన్న ఏడుగురు నిందితులకు సమన్లు జారీ చేయడం సహా అంతా ట్రైయల్ ఎదుర్కోవాల్సిందేనని అందుకు తగిన పూర్తి ఆధారాలు ఛార్జిషీట్లో సీబీఐ స్పష్టం చేసిందని ప్రత్యేక కోర్టు తెలిపింది.
ఇవీ చదవండి: