CBI searches Telugu Desam Party leader house: ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా పెనుకొండలో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. సవిత భర్త వెంకటేశ్వరరావు రైల్వే కాంట్రాక్టర్. ఇటీవల కాలంలో రైల్వే అధికారుల అవినీతిపై.. సీబీఐ అధికారులు దాడులు చేస్తున్నారు.
CBI SEARCH: తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలి ఇంట్లో సీబీఐ సోదాలు.. అసలేం జరిగింది? - satyasai
CBI searches Telugu Desam Party leader house: తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. సవిత భర్తపై ఫిర్యాదు రావడంతో.. సాక్ష్యాధారాల కోసం వారి ఇంటిలోనే సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.
తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత
ఇందులో భాగంగా రైల్వే అధికారుల అవినీతికి సంబంధించి ఆధారాల కోసం.. రైల్వే కాంట్రాక్టర్ అయిన వెంకటేశ్వరరావు ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన సీబీఐ అధికారులు.. సవిత ఇంట్లో ఈ ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. ఇంటికి లోపల తాళం వేసి పత్రాలను పరిశీలిస్తున్నారు. సీబీఐ సోదాల సమాచారం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.. సబితా ఇంటి వద్దకు చేరుకున్నారు.
ఇవీ చదవండి: