పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన వ్యవహారంలో రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు కంపెనీ, పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.826.17 కోట్ల మేర మోసగించినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు, కన్సార్టియం బ్యాంకులు ఫిర్యాదు చేశాయి.
బ్యాంకులను మోసగించిన వ్యవహారంలో ప్రైవేటు కంపెనీపై కేసు - Cbi latest updates
రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు కంపెనీ, పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.826.17 కోట్ల మేర మోసగించినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు, కన్సార్టియం బ్యాంకులు ఫిర్యాదుతో సీబీఐ రంగంలోకి దిగింది.
![బ్యాంకులను మోసగించిన వ్యవహారంలో ప్రైవేటు కంపెనీపై కేసు బ్యాంకులను మోసగించిన వ్యవహారంలో ప్రైవేటు కంపెనీపై కేసు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9102350-478-9102350-1602167729715.jpg)
బ్యాంకులను మోసగించిన వ్యవహారంలో ప్రైవేటు కంపెనీపై కేసు
ఈ వ్యవహారంలో 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, ముంబయి, ప.గో. జిల్లాలో సీబీఐ సోదాలు జరిపింది. నిందితుల ఇళ్లు, సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. సదరు సంస్థ ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన దానిగా పీటీఐ పేర్కొంది.
ఇదీ చదవండి:'కేంద్ర వ్యవసాయ బిల్లు.. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం'