వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ చేస్తున్న సీబీఐ.. కడప జిల్లా పులివెందులోని అనుమానితుల ఇళ్లను తనిఖీ చేసింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించి, కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే అరెస్టైన సునీల్ యాదవ్ ఇంటిని తనిఖీ చేసిన సీబీఐ అధికారులు.. వ్యవసాయానికి వాడే కత్తులు, కొడవళ్లు సహా మరికొన్ని పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. సునీల్ యాదవ్ బ్యాంకు పాస్ పుస్తకం, పాత చొక్కా కూడా వెంట తీసుకెళ్లారు. ఈ మేరకు పంచనామా నిర్వహించి, సునీల్ తండ్రికి వస్తువుల జాబితా అందజేశారు. అలాగే సునీల్ సొంతూరు మోటునూతనపల్లె, సునీల్ భార్య లక్ష్మి సొంతూరు వెన్నపూసపల్లిలో కూడా సోదాలు నిర్వహించారు. అక్కడ కొన్ని కొడవళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి ఇళ్లలో కూడా తనిఖీలు చేశారు. దస్తగిరి ఇంట్లోనూ కొన్ని వ్యవసాయ పనిముట్లను, ఇంట్లో వాడే కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఇరికించడానికి సీబీఐ ప్రయత్నిస్తోందని.. సునీల్ కుటుంబసభ్యులు మరోసారి ఆరోపించారు.
సుదీర్ఝ విచారణ..