కేంద్ర జీఎస్టీ సూపరింటెండెంట్ బీఎస్ గాంధీపై సీబీఐ ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది. గాంధీ, ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై 2010 నుంచి ఈ ఏడాది వరకు అక్రమాస్తులు కూడబెట్టుకున్నట్లు సీబీఐ పేర్కొంది. హైదరాబాద్, విజయవాడలోని గాంధీ ఆస్తులపై సీబీఐ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించి.. పలు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నాయి.
కేంద్ర జీఎస్టీ అధికారి బీఎస్ గాంధీపై సీబీఐ కేసు - CGST OFFICER
కేంద్ర జీఎస్టీ అధికారి బీఎస్ గాంధీపై సీబీఐ ఇవాళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. గాంధీ, ఆయన కుటుంబ సభ్యులు రూ.3 కోట్ల 74 లక్షల అక్రమాస్తులు కూడబెట్టుకున్నట్లు ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది.
హైదరాబాద్‌లోని కూకట్పల్లి, మదీనాగూడ, కొండాపూర్, హైదర్నగర్తో పాటు.. విజయవాడ, కంకిపాడు, పొద్దూటూరులో భూములు సంపాదించినట్లు ఎఫ్ఐఆర్లో వెల్లడించింది. ఇద్దరు కుమార్తెలను భారీ ఖర్చుతో చదివించినట్లు అభియోగం మోపింది. ఇప్పటి వరకు రూ.3 కోట్ల 74 లక్షల అక్రమాస్తులు కూడబెట్టుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించింది. సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో 1992లో ఇన్స్పెక్టర్గా చేరిన గాంధీ ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లో 2004 నుంచి 2017 వరకు గాంధీ వివిధ హోదాల్లో పనిచేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఆస్తుల జప్తు ప్రక్రియలో గాంధీ కీలకంగా వ్యవహరించారు. ఆయనపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయ్ సాయిరెడ్డి గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: కర్'నాటకం'పై దద్దరిల్లిన ఉభయసభలు