తెలంగాణ

telangana

ETV Bharat / state

జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడి కార్యాలయంలో సీబీఐ సోదాల కలకలం - ఏపీలో సీబీఐ

CBI raids at JC Prabhakar Reddy Follower: జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు.. చవ్వా గోపాల్ రెడ్డి కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. బెంగుళూరు నుంచి వచ్చిన ఆరుగురు సీబీఐ అధికారుల బృందం బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు గోపాల్ రెడ్డి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. దాదాపు మూడు గంటలపాటు నిర్వహించిన సోదాల్లో గోపాల్ రెడ్డి కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు.

CBI raids at JC Prabhakar Reddy Follower
CBI raids at JC Prabhakar Reddy Follower

By

Published : Dec 22, 2022, 6:03 AM IST

CBI raids at JC Prabhakar Reddy Follower: అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు.. చవ్వా గోపాల్ రెడ్డి కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డితో కలిసి బీఎస్-3 వాహనాలను బీఎస్-4 గా మార్చి రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చవ్వా గోపాల్ రెడ్డిపై సీబీఐ కేసు నమోదైంది. బెంగుళూరు నుంచి వచ్చిన ఆరుగురు సీబీఐ అధికారుల బృందం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు గోపాల్ రెడ్డి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

క్లాస్-1 కాంట్రాక్టర్ గా ఉన్న గోపాల్ రెడ్డి చేసిన పనులకు సంబంధించిన సమాచారం తీసుకోటానికి వచ్చారా, లేక వాహనాల రిజిస్ట్రేషన్ సంబంధించిన కేసుకు సంబంధించి ప్రశ్నించటానికి వచ్చారా అన్న విషయంపై అధికారులు మీడియాకు స్పష్టత ఇవ్వలేదు. గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులంతా ఇంటికి తాళం వేసి వేరే ప్రాంతంలో శుభకార్యానికి వెళ్లినట్లు సీబీఐ అధికారులకు చెప్పారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను పిలిపించటానికి అధికారులు ప్రయత్నం చేశారు. అందరూ దూర ప్రాంతంలో ఉండటంతో, చేసేదేమీలేక, కార్యాలయం తాళాలు తెరిపించి సోదాలు చేశారు. దాదాపు మూడు గంటలపాటు నిర్వహించిన సోదాల్లో గోపాల్ రెడ్డి కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details