తెలంగాణ

telangana

ETV Bharat / state

వివేకా హత్య కేసు.. అవినాష్‌ రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు.. పులివెందులకు అధికారులు

CBI NOTICES TO MP AVINASH : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డికి సీబీఐ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 28న హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు దర్యాప్తు అధికారుల బృందం ఇవాళ పులివెందుల వెళ్లి అవినాశ్ రెడ్డి ఇంటిని, పరిసరాలను పరిశీలించింది.

CBI NOTICES TO MP AVINASH
CBI NOTICES TO MP AVINASH

By

Published : Jan 25, 2023, 2:56 PM IST

Updated : Jan 25, 2023, 3:26 PM IST

CBI NOTICES TO MP AVINASH : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు వేగం చేశారు. ఈరోజు ఉదయమే కడప ఎంపీ వైఎస్​ అవినాష్​ రెడ్డికి రెండోసారి నోటీసులు పంపించిన సీబీఐ అధికారులు.. పులివెందుల చేరుకున్నారు. రెండు వాహనాల్లో అవినాష్‌రెడ్డి ఇంటికెళ్లిన సీబీఐ అధికారులు.. ఇంట్లో, బయట పరిసరాలను పరిశీలించారు. ఇంట్లో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి లేకపోవడంతో వెనుదిరిగారు. అనంతరం వైఎస్‌ వివేకా ఇంటి పరిసరాలను పరిశీలిస్తున్నారు.

రెండోసారి అవినాష్​కు నోటీసులు : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.

అవినాష్‌రెడ్డికి మూడు రోజుల క్రితమే మొదటిసారి సీబీఐ నోటీసులు అందజేసింది. మంగళవారం (24వ తేదీ) విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల ఆరోజు తాను రాలేననని చెప్పారు. ‘నిన్న నోటీసులు ఇచ్చి.. నేడు విచారణకు రమ్మంటే ఎలా?’ అని మంగళవారం ఆయన వ్యాఖ్యానించారు. విచారణకు హాజరయ్యేందుకు ఐదు రోజుల సమయం కావాలని అవినాష్‌రెడ్డి కోరారు.

ఈ నేపథ్యంలో రెండోసారి సీబీఐ నోటీసులు జారీ చేస్తూ 28న విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. దాదాపు రెండున్నరేళ్లుగా కేసును దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు సంస్థ.. ఇప్పటివరకూ ఒక్కసారీ ఆయనను ప్రశ్నించలేదు. కడప నుంచి హైదరాబాద్‌కు కేసు బదిలీ అయిన తర్వాత తాజాగా విచారణ మొదలుపెట్టిన సీబీఐ.. అవినాష్‌కు నోటీసులిచ్చింది.

Last Updated : Jan 25, 2023, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details