ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో మాజీ ఎంపీ, తెదేపా నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోదాలు జరుగుతున్నాయి. ట్రాన్స్ట్రాయ్ నిర్మాణ సంస్థ వ్యవహారాలపై సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. రాయపాటికి వాటాలున్న ఈ సంస్థపై బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి సీబీఐ కేసు నడుస్తోంది. ఇందులో భాగంగానే రాయపాటి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
మాజీ ఎంపీ రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు
ఏపీలోని గుంటూరులో మాజీ ఎంపీ, తెదేపా నేత రాయపాటి సాంబశివరావు నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోదాలు జరుగుతున్నాయి. ట్రాన్స్ట్రాయ్ నిర్మాణ సంస్థ వ్యవహారాలపై సీబీఐ అధికారులు ఉదయం నుంచి విచారణ నిర్వహిస్తున్నారు.
మాజీ ఎంపీ రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు
ఇవాళ ఉదయం 8 గంటలకు దర్యాప్తు సంస్థ అధికారులు రాయపాటి నివాసానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు. వివిధ గదులు, ఆఫీసులో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి:'నాకు అప్పగించండి.. ఆమిర్‌ను రాటుదేల్చుతా'