కరోనా వంటి కష్టకాలంలో సాంకేతిక పరమైన ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. నిత్యవసర వస్తువులను ఇంటి వద్దకే అందించేందుకు రూపొందించిన భాగ్య బాస్కెట్ గ్రాసరీ మొబైల్ యాప్ వెబ్సైట్ను ఆయన ప్రారంభించారు.
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిత్యవసర వస్తువులు, ఇతర ఉత్పత్తులు ఇంటి వద్దకే అందించడం అభినందనీయమని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కరోనా సమయంలో ఇలాంటి సేవలు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, మాస్కులు ధరించడం విధిగా పాటించాలని సూచించారు. త్వరలోనే వైరస్ బారి నుంచి బయటపడి.. సాధారణ జీవితం జీవిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.