Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ అధికారుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో మకాం వేసిన సీబీఐ డీఐజీ చౌరాసియా... వివేకా హత్య కేసుపై అధికారులతో ఆరా తీస్తున్నారు. హైకోర్టు తీర్పు దృష్ట్యా వాంగ్మూలం పత్రాలను... సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో సమర్పించనున్నారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరితో మరోసారి కోర్టులో.. వాంగ్మూలం నమోదు చేయించనున్నారు. కేసులో ఉన్న కీలక వ్యక్తులప్రమేయాన్ని పూర్తిగా నిర్ధరణచేసి..తదుపరిచర్యలు చేపట్టే అవకాశాన్నిసీబీఐ పరిశీలిస్తుంది.కోర్టుకుసమర్పించిన వివరాల ప్రకారంకడప ఎంపీ పాత్రను తేల్చే దిశగావిచారణ సాగుతోంది
కడప సబ్ కోర్టు అనుమతి..
Viveka Murder Case : మాజీమంత్రి వివేకా హత్య కేసులో.. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి కడప సబ్ కోర్టు అనుమతి ఇచ్చింది. దస్తగిరి అప్రూవర్‌గా మారుతున్నాడని.. 306 సెక్షన్ కింద సాక్ష్యం నమోదు చేయాలని కడప సబ్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.