జీఎస్టీలోని మరో అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు సీబీఐ నమోదు చేసింది. జీఎస్‌టీ హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలోని కంప్యూటర్ సెక్షన్ సూపరింటెండెంట్ కేఎస్ఎస్ జనార్దన్ రావు భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నట్లు సీబీఐ గుర్తించింది. జనార్దన్‌రావుతోపాటు.. ఆయన భార్య శైలజపై కేసు నమోదు చేసి పలు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపింది.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జీఎస్‌టీ అధికారిపై సీబీఐ కేసు - హైదరాబాద్‌లో జీఎస్‌టీ అధికారి ఇంట్లో సీబీఐ సోదాలు
19:12 October 02
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జీఎస్‌టీ అధికారిపై సీబీఐ కేసు
వేతనం ద్వారా వచ్చిన ఆదాయానికన్నా సుమారు కోటి 27 లక్షల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టుకున్న దర్యాప్తు సంస్థ గుర్తించింది. సెంట్రల్ ఎక్సైజ్‌లో ఇన్స్పెక్టర్గా 1992లో చేరిన కేఎస్ఎస్ జనార్దన్ రావు.. 2003లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందారు. సెంట్రల్ ఎక్సైజ్‌లో కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగంలో 2007 నుంచి 2014 వరకు డిప్యూటేషన్‌పై సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు.
హైదరాబాద్‌లోని జీఎస్‌టీ కమిషనరేట్‌లో పన్ను ఎగవేత విభాగంలో మూడేళ్లుగా సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. జనార్దన్ రావు, ఆయన భార్య పేరిట భారీగా ఆస్తులను సీబీఐ గుర్తించింది. హైదరాబాద్‌లోని పెద్ద అంబర్ పేట, హైదర్ నగర్, జల్పల్లి, మణికొండ, యూసుఫ్ గూడ, మధురానగర్‌లో ఫ్లాటు. గుంటూరు, మంగళగిరి, అమరావతి ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు సీబీఐ పేర్కొంది. సీబీఐ కేసు నమోదు చేసి కీలక ఆధారాలు సేకరించింది.
ఇదీ చూడండి :స్కూల్ ఫీజులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: శివబాలాజీ, మధుమిత