రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేశాయన్న అభియోగంపై హైదరాబాద్‌లోని రెండు కంపెనీలు, వాటి డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. రెండు సంస్థల డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. నిర్మాణ, ఇంజినీరింగ్ రంగ వ్యాపారాలు నిర్వహించే సుధాంశు ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి సుమారు 8 కోట్ల 75 లక్షల రూపాయల రుణాలు తీసుకొని మోసం చేసినట్లు చెన్నైలోని సీబీఐ ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. తప్పుడు దస్త్రాలు, బోగస్ ధ్రువపత్రాలు సమర్పించి బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని... కంపెనీయేతర అవసరాల కోసం నిధులను మళ్లించి.. ఆ తర్వాత రుణాలు ఎగవేసినట్లు అభియోగం. సుధాంశు ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు మద్దాల రమేష్ రెడ్డి, బోళ్ల రఘుపతి రావు, యద్దాల రమణారెడ్డిపై కేసు నమోదు చేసి వారి ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయి.
ఇంక్లయిన్ ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై హైదరాబాద్ సీబీఐ విభాగం కేసు నమోదు చేసింది. ఇంక్లయిన్ ఆగ్రోటెక్.. రుణాల పేరుతో ఎస్బీఐలో 6 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసినట్లు అభియోగం. తప్పుడు దస్త్రాలు, ధ్రువపత్రాలు సమర్పించి రుణాలు పొంది... నిధులను మళ్లించినట్లు సీబీఐకి ఎస్బీఐ ఫిర్యాదు చేసింది. ఎస్బీఐ అధికారి అబ్దుల్ రవూఫ్ పాషా, న్యాయవాదులు మాగంటి సత్యనారాయణ రావు, ఎ.శ్రీనివాస ప్రసాద్‌తో పాటు... ఇంక్లయిన్ ఆగ్రోటెక్ డైరెక్టర్లు విక్రం బాబు, కె.శివకుమార్లపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు... ఏకకాలంలో సోదాలు జరిపి పలు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.
బ్యాంకులను మోసం చేసిన 2 కంపెనీల్లో సీబీఐ సోదాలు - Fraud_Cases in hyderabad
రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసిన రెండు కంపెనీలు, వాటి డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ సంస్థల డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.
బ్యాంకులను మోసం చేసిన 2 కంపెనీల్లో సీబీఐ సోదాలు
ఇవీ చూడండి: డెడ్‌లైన్ విధించడం దారుణమైన చర్య: రాఘవులు