వివేకా హత్య కేసు విషయమై ఏపీ హైకోర్టులో సీబీఐ వేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి.. అనుబంధ పిటిషన్ ప్రతిని పిటిషనర్ల తరఫు న్యాయవాదికి అందజేయాలని సూచిస్తూ విచారణ వాయిదా వేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సంబంధిత రికార్డులన్నీ ఇవ్వాలని పులివెందుల మేజిస్ట్రేట్‌ను సీబీఐ కోరింది. ఈ అభ్యర్థనను మేజిస్ట్రేట్ తిరస్కరించింది. ఈ కారణంగా హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది.
వివేకా హత్య కేసు: ఏపీ హైకోర్టులో సీబీఐ అనుబంధ పిటిషన్ - వివేకా హత్య కేసులో సీబీఐ అనుబంధ పిటిషన్ తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన రికార్డులను ఇచ్చేలా పులివెందుల మెజిస్ట్రేట్‌ను ఆదేశించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో సీబీఐ అనుబంధ పిటిషన్ వేసింది.

వివేకా హత్య కేసు: హైకోర్టులో సీబీఐ అనుబంధ పిటిషన్
TAGGED:
సీబీఐ హత్య కేసు తాజా వార్తలు