Cattle Festival in AP : ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో సంక్రాంతి పండుగకు ముందే పశువుల పండుగ హడావుడి మొదలైంది. కొత్త ఏడాదిని పురస్కరించుకుని.. చంద్రగిరి మండలంలోని కొత్త శానంబట్ల గ్రామంలో ఈ ఉదయం నుంచే పశువుల పండుగ వేడుకలు నిర్వహిస్తున్నారు. వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దఎత్తున జనం తరలివచ్చారు. గ్రామంలో పశువుల పండుగ నిర్వహణకు పోలీసులు ఆంక్షలు పెట్టినా లెక్కచేయలేదు.
సంక్రాంతి కంటే ముందే అక్కడ పండుగ మొదలైంది..!
Cattle Festival in AP : సంక్రాంతి వచ్చిందంటే ఊర్లలో కుర్రాళ్ల జోరు మామూలుగా ఉండదు. ఇక ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో పశువుల పండుగ మొదలవడంతో.. రంకలేసే కోడెగిత్త కొమ్ములొంచేందుకు కుర్రాళ్లు సిద్దం అయ్యారు. కోడెగిత్త మెడలు వంచి దాని కొమ్ములకు కట్టిన బహుమతిని సొంతం చేసుకునేందుకు యువత పోటీపడ్డారు.
తిరుపతి
చివరకు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. కోడె గిత్తలకు కట్టిన బహుమతులు సొంతం చేసుకునేందుకు యువత పోటీ పడ్డారు. ఈ క్రమంలో పలువురు యువకులకు గాయాలయ్యాయి.
ఇవీ చదవండి: