తెలంగాణ

telangana

ETV Bharat / state

Gandhi and Osmania hospitals: గాంధీ, ఉస్మానియాల్లో ఆ సేవలు బంద్‌ - హైదరాబాద్​ వార్తలు

గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో గత కొంతకాలంగా క్యాథ్‌ల్యాబ్‌ సేవలు నిలిచిపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు కాసుల పంట పండుతోంది. ఆసుపత్రుల వద్ద దళారులు తిష్ఠ వేసి మరీ పేద రోగులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

catheterization laboratory services
క్యాథ్‌ల్యాబ్‌ సేవలు బంద్‌

By

Published : Nov 18, 2021, 8:44 AM IST

గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో క్యాథ్‌ల్యాబ్‌ సేవలు (catheterization laboratory services) అందుబాటులో లేకపోవడంతో రోగులు నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గాంధీ ఆసుపత్రిలో క్యాథ్‌ల్యాబ్‌ (catheterization laboratory services) పనిచేయక పోవడంతో ఏడాదిగా దీన్ని మూసి వేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో క్యాథ్‌ల్యాబ్‌ పాతబడిపోవడంతో దాని బదులు కొత్త ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ఆస్పత్రులు పేద రోగులను బుట్టలో వేసుకుంటున్నారు.

కొందరు నిమ్స్‌కు వెళ్తున్నారు. అక్కడ ప్రస్తుతం మూడు ల్యాబ్‌లు (catheterization laboratory services) ఉన్నాయి. నిమ్స్‌కు హృద్రోగ, వాస్క్యులర్‌ సమస్యలతో నిత్యం 100-150 మంది వరకు వస్తుంటారు. నిత్యం 30-40 వరకు యాంజియోగ్రామ్‌లు, యాంజియోప్లాస్టీలు ఇతర చికిత్సలు చేస్తుంటారు. మరోవైపు గాంధీ, ఉస్మానియా రోగులను ఇక్కడకే పంపుతుండటంతో ల్యాబ్‌ల (catheterization laboratory services)పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. నిమ్స్‌లో సేవలకు ప్రైవేటు తరహాలో ప్రతిదానికి డబ్బులు చెల్లించాలి. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మాత్రం ఉచితంగా సేవలు పొందే వీలుంది. చాలామందికి ఆరోగ్యశ్రీ కార్డులు లేనందు వల్ల సేవలు పొందలేకపోతున్నారు. మరికొందరు అప్పులు చేసి ప్రైవేటు ఆసుపత్రులకు వైపు వెళ్తున్నారు. ఇదే అదనుగా దళారులను ఇలాంటి వారిని బుట్టలో వేసుకుంటున్నారు. హృద్రోగ సమస్యలతో వచ్చే రోగులకు క్యాథ్‌ల్యాబ్‌ సేవలు (catheterization laboratory services) చాలా కీలకం. గుండె సమస్య ఉంటే తొలుత ఈసీజీ, 2డీఈకో లాంటి పరీక్షలు నిర్వహిస్తారు. గుండె రక్తనాళాల్లో ఏదైనా సమస్య ఉన్నట్లు అనుమానిస్తే యాంజియోగ్రామ్‌ నిర్వహిస్తారు. పూడిక ఉంటే యాంజియోప్లాస్టీ చేసి స్టంట్లు అమర్చుతారు.

గాంధీ ఆసుపత్రిలోని ల్యాబ్‌

  • కొందరికి గుండె వాల్వుల్లో సమస్య ఉంటుంది. ఇలాంటి వారికి వాల్వు శస్త్ర చికిత్సలు లేదంటే వాల్వుల మార్పిడి చేయాలి. గుండె లయలో మార్పు వచ్చినప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ చికిత్సలు అవసరమవుతాయి.
  • కొందరికి గుండెల్లో రక్త నాళాలు చిట్లే ప్రమాదం ఉంటుంది. మరికొందరికి గుండెల్లో రంధ్రాలకు చికిత్సలు అందించాలి. ఈ సేవలన్నీ క్యాథ్‌ల్యాబ్‌ (catheterization laboratory services) లోనే నిర్వహిస్తారు.
  • గాంధీలో ఏడాదిగా...ఉస్మానియాలో క్యాథ్‌ల్యాబ్‌ సేవలు (catheterization laboratory services) ఉచితమే. గత ఆరేడు నెలలుగా పేద హృద్రోగులు ఈ సేవలను పొందలేకపోతున్నారు. 20-30 శాతం పూడికలున్న వారికి మందులు ఇచ్చి తర్వాత రావాలని, లేదంటే బయట చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నిమ్స్‌లో యాంజియోగ్రామ్‌ చేయాలంటే రూ.8-10 వేలు ఛార్జీచేస్తారు.

కీలక సేవలు...

  • అదే ప్రైవేటులో మూడు రెట్లు అధికం. ఇక స్టంట్‌ వేయాలంటే నిమ్స్‌లో రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. అదే ప్రైవేటులో రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గాంధీ, ఉస్మానియాలో 10-15 మంది రోగులకు నిత్యం క్యాథ్‌ల్యాబ్‌లు సేవలు అవసరం అవుతున్నాయి.
  • ఉస్మానియాలో ఈ నెలాఖరు నాటికి కొత్త ల్యాబ్‌ (catheterization laboratory services) అందుబాటులోకి వస్తుందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేంద్ర తెలిపారు. గాంధీలో ల్యాబ్‌ (catheterization laboratory services) విషయమై ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.రాజారావు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details