తెలంగాణ

telangana

ETV Bharat / state

చంకలో పిల్లిని పెట్టుకెళ్లొచ్చు తెలుసా..! - పిల్లి బొమ్మనో చంకలో పెట్టుకెళ్తే అందరి కళ్లూ చటుక్కున మనవైపు తిరుగుతాయి.

ఆఫీసుకెళ్లేటపుడూ... బయటికెళ్లేటపుడూ... హ్యాండ్‌బ్యాగుని తగిలించుకెళ్లడం సహజమే. కానీ అందరిలాంటి బ్యాగునే మనమూ పట్టుకెళ్తే వెరైటీ ఏముందీ. ఏ పిల్లి బొమ్మనో చంకలో పెట్టుకెళ్తే అందరి కళ్లూ చటుక్కున మనవైపు తిరుగుతాయి.

చంకలో పిల్లిని పెట్టుకెళ్లొచ్చు తెలుసా..!

By

Published : Nov 23, 2019, 6:15 PM IST

అవునూ... పైన ఫొటోలో ముద్దుగా... చాలా బొద్దుగా కనిపిస్తున్న పిల్లి బొమ్మలు బ్యాగులే. జపాన్‌కు చెందిన ఫెలిస్సిమో కంపెనీ రూపొందించిన ఈ బ్యాగులు... ఖాళీగా ఉన్నపుడు మామూలు సంచుల్లానే ఉంటాయి. కానీ బ్యాగుని వస్తువులతో నింపగానే ఇలా బొద్దు పిల్లి ఆకారంలో కనిపిస్తాయి. భలే విడ్డూరంగా ఉన్నాయి కదూ..!

ABOUT THE AUTHOR

...view details