తెలంగాణ

telangana

ETV Bharat / state

'జర్నలిస్టు కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి' - సైదాబాద్ నల్ల జండాలతో శాంతి ర్యాలీ

జర్నలిస్టు మనోజ్ కుమార్​ మృతి నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. వారి కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.

caste sangams demand Journalist Manoj family should be given jobs
జర్నలిస్ట్ మనోజ్ కుటుంబానికి ఉద్యోగాలు ఇవ్వాలి

By

Published : Jun 14, 2020, 6:45 AM IST

హైదరాబాద్ సైదాబాద్ లైఫ్ స్టైల్ అపార్ట్​మెంట్ నుంచి గణేశ్​ చౌరస్తా వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతికి నల్ల జండాలతో శాంతి ర్యాలీ జరిపారు.

మనోజ్ కుమార్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్​గ్రేషియా చెల్లించాలన్నారు. వారి కుటుంబానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అందరినీ కాపాడే జర్నలిస్టు మిత్రులకే ఇలా అయితే వారిని కాపాడేది ఎవరని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టు మిత్రులకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి :స్పిన్నింగ్ మిల్లుల సంక్షోభం.. జీతాలు లేక కార్మికుల అవస్థలు

ABOUT THE AUTHOR

...view details