తెలంగాణ

telangana

ETV Bharat / state

తపాలా యాప్‌తో నగదు బదిలీ - Dak Pay is the latest news

తపాలా బ్యాంకు ఖాతాదారులు ఇక నుంచి మొబైల్‌ ఫోను ద్వారా ఇతర బ్యాంకు ఖాతాలకు నగదును క్షణాల్లో బదిలీ చేయవచ్చు. మొబైల్‌ రీఛార్జితో పాటు విద్యుత్తు, నీటిబిల్లులు, పెట్రోల్‌ బంకుల్లో, బీమా ప్రీమియం వంటి చెల్లింపులూ జరపొచ్చు. ఇందుకోసం తపాలాశాఖ ‘డాక్‌ పే’ డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ పేరుతో కొత్తగా యాప్‌ను తీసుకువచ్చింది. షాపింగ్‌కు వెళ్లినప్పుడు క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌ ద్వారా బిల్లుల చెల్లింపు వెసులుబాటూ ఉంది. గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పే తరహాలో డాక్‌ పే పనిచేస్తుందని తపాలాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

తపాలా యాప్‌తో నగదు బదిలీ
తపాలా యాప్‌తో నగదు బదిలీ

By

Published : Dec 17, 2020, 6:58 AM IST

ఈ యాప్‌లో.. తపాలా బ్యాంకు ఖాతాతో పాటు తమకున్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు(140 బ్యాంకులకు చెందిన) ఖాతాలను లింక్‌ చేసుకోవచ్చు. ఒక యాప్‌లో ఎన్ని బ్యాంకు ఖాతాలనైనా అనుసంధానం చేసుకోవచ్చు. అందులో ఏ ఖాతా నుంచైనా మిత్రులు, బంధువులు, ఎవరి బ్యాంకు ఖాతాకైనా నగదును బదిలీ చేయొచ్చు. దీనికోసం తపాలాశాఖ యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)తో ఒప్పందం చేసుకుంది. పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతా ఉంటే ఐపీపీబీతో పాటు లింక్‌ చేసుకుని ఆ ఖాతాలోని సొమ్మును చెల్లింపులు, నగదు బదిలీకి ఉపయోగించవచ్చని తపాలాశాఖ వర్గాలు చెబుతున్నాయి.


తెలంగాణ సర్కిల్‌లో..

  • ఐటీపీబీ ఖాతాల సంఖ్య 18 లక్షలు
  • ఐటీపీబీతో అనుసంధానమైన తపాలా పొదుపు ఖాతాలు 85 వేలు

డాక్‌ పే యాప్‌ విశేషాలు

  • ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది?

బుధవారం నుంచి

  • యాప్‌ను పొందడమెలా?

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డాక్‌ పే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవాలి

  • లాగిన్‌ కావడమెలా?

ఇండియా పోస్టుపేమెంట్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ఖాతాతో లాగిన్‌ కావాలి

  • ఎన్ని డౌన్‌లోడ్లు?

ఇప్పటి వరకూ 50 వేలు (దేశవ్యాప్తంగా)

టోల్‌గేట్‌ రుసుం కట్టొచ్చు

ఈ యాప్‌తో వినియోగదారులకు మంచి సేవలు అందుతాయి. బిల్లుల చెల్లింపుతో పాటు కొన్నిచోట్ల టోల్‌గేట్‌ రుసుం యాప్‌తో కట్టొచ్చు. తపాలా పొదుపు ఖాతా లేకపోయినా యాప్‌ సేవలు పొందొచ్చు. ఐపీపీబీ ఖాతా ఉండాలి. - డాక్టర్‌ పీవీఎస్‌ రెడ్డి, పోస్టుమాస్టర్‌ జనరల్‌ హైదరాబాద్‌ రీజియన్‌

ABOUT THE AUTHOR

...view details