Cash Seized During Police Check in Hyderabad: రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సమయాత్తమవుతోంది. నవంబర్ 30న జరిగే ఎన్నికలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవి ఆనంద్ ఉన్నతాధికారుతో సమీక్షించారు. శాఖాపరంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అక్రమ నగదు(Illegal Money), మద్యం, మాదక ద్రవ్యాలు లేదా ఇతర ప్రలోభాలపై కఠిన చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రచార సమయంలో వివిధ రాజకీయ పార్టీల ఒకే మార్గంలో తారసపడకుండా చూసుకోవాలని.. దీంతో పాటు రూట్ ప్లానింగ్, టైమింగ్, అనుమతుల జారీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీపీ స్పష్టం చేశారు.
Police Checking Points in Telangana : ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లడం ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడొచ్చని తెలిపారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఆయుధాలకి కొత్త లైసెన్స్‌లు జారీ చేయకూడదని సీవీ ఆనంద్ సూచించారు. ఇంటిగ్రేటెడ్ ఇంటర్ కమిషనరేట్ చెక్‌పోస్టుల సంఖ్యను 11 నుంచి 18కి పెంచనున్నట్లు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల(Social Media)పై పర్యవేక్షణ, హవాలా ఆపరేటర్లపై నిఘా పెట్టాలని దిశానిర్దేశం చేశారు.
Police Caught Huge Hawala Cash in Hyderabad: బంజారాహిల్స్‌లో రూ.3.35 కోట్ల హవాలా మనీ పట్టివేత
Hyderabad Police Seized Unaccounted Money and Gold: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికార యంత్రాంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోందని సీపీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడే తనిఖీలు, సోదాల్లో భారీగా సొత్తు లభిస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తనిఖీల్లో రూ.5.1 కోట్ల నగదు, రూ.42 కోట్లు విలువైన బంగారం(Gold) స్వాధీనం చేసుకున్నట్లు సీవీ ఆనంద్(CV Anandh) తెలిపారు. మంగళవారం రాత్రి బంగారం వ్యాపారి నుంచి కూకట్‌పల్లిలోని రూ.2కోట్లు విలువైన బంగారం, వజ్రాలను ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించారు. ఆ వ్యాపారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.