శిరస్త్రాణమే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు గల్లీలనూ వదలకుండా జరిమానాలు వడ్డిస్తుంటే.. సైబరాబాద్ అధికారులు వెనుకకూర్చున్న వారు కూడా శిరస్త్రాణం ధరించాలంటూ హెచ్చరిస్తున్నారు. శిరస్త్రాణం లేకుండా ప్రయాణానికి సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జులై నెలలో 3,86,354 కేసులు నమోదు చేశారు.
శిరస్త్రాణం లేకుండా ప్రయాణం.. జులైలో 3.86లక్షల కేసులు - హైదరాబాద్లో హెల్మెట్లేని ప్రయాణం కేసులు తాజా వార్త
శిరస్త్రాణం ధరించండి... ప్రాణాలను కాపాడుకోండి అంటూ ట్రాఫిక్ పోలీసులు పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ఎటువంటి ఫలితం లేకుండా పోతోంది. జులై నెలలో హెల్మెట్ లేకుండా భాగ్యనగరంలో ప్రయాణిస్తున్న వారిపై నమోదైన కేసులు దాదాపు మూడున్నర లక్షలకుపై మాటే అని అధికారులు వెల్లడించారు.

శిరస్త్రాణం లేకుండా ప్రయాణం.. జులైలో 3.86లక్షల కేసులు నమోదు
మోటార్ వాహనచట్టం ప్రకారం ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలంటూ పోలీస్ అధికారులు చెబుతున్నారు. కానీ, అవగాహన కార్యక్రమాల్లో మాత్రం వెనుకబడుతున్నారు. రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు 80శాతం ద్విచక్రవాహనదారులే కారణమని ట్రాఫిక్ పోలీసుల అంచనా.
ఇదీ చూడండి :పరిశ్రమల్లో అత్యధిక ఉద్యోగాలు స్థానికులకే..
TAGGED:
latest news of helmet cases