తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్టి పేరుతో రోడ్డుపై హల్​చల్​.. కేసు నమోదు - telangana latest news

ఒకరు ఏమో తెరాస తెరాస అధ్యక్షుడు అంటూ... మరొకరు తెరాస స్టేట్​ యూత్​ వింగ్​ అంటూ రోడ్లపై తిరుగుతూ హల్​ చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి.. వాహనాన్ని సీజ్ చేశారు.

case on cars
case on cars

By

Published : May 22, 2021, 5:45 PM IST

గ్రామానికి తెరాస అధ్యక్షుడు అంటూ ఒకరు.. తెరాస స్టేట్​ యూత్​ వింగ్​ అంటూ మరొకరు.. ఇలా ఇద్దరు రెండు కార్లలో ఎలాంటి అనుమతి లేకున్నా.. రోడ్లపై ఇష్టారితీనా తిరుగుతుండగా పోలీసుల తనీఖీల్లో పట్టుబడ్డారు. హైదరాబాద్ షాపూర్ నగర్​ చెక్​ పోస్ట్ వద్ద బాలానగర్ ఏసీపీ పురుషోత్తం ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఒకరు మల్కాపూర్​ గ్రామానికి తెరాస అధ్యక్షుడు అంటూ.. రోడ్డుపై తిరుగుతున్నాడు.

పోలీసుల అతన్ని ఆపి ప్రశ్నించగా.. భయంలేకుండా అధ్యక్షుడిని అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీనితో వాహనాన్ని సీజ్ చేసి.. కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:'బ్లాక్ ఫంగస్​ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. ముప్పు తక్కువ'

ABOUT THE AUTHOR

...view details