1.30 crore scholarship for Hyderabad student: హైదరాబాద్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి వేదాంత్ ఆనంద్‌వాడేకు అమెరికాలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్ అందించనుంది. ఈ మేరకు ఆ వర్సిటీ అంగీకార పత్రాన్ని, స్కాలర్‌షిప్ లేఖను పంపింది. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐసీఎస్‌ఈ సిలబస్‌తో 12వ తరగతిని పూర్తి చేసిన వేదాంత్.. అమెరికాలో న్యూరోసైన్స్ చదవనున్నాడు.
1.30 crore scholarship : హైదరాబాద్ విద్యార్థికి బంపర్ ఆఫర్.. రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్ - హైదరాబాద్ విద్యార్థికి అమెరికా యూనివర్సిటీ స్కాలర్‌షిప్
1.30 crore scholarship for Hyderabad student: అమెరికాలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్ అందించనున్నట్లు అంగీకార పత్రాన్ని, స్కాలర్‌షిప్ లేఖను విద్యార్థికి పంపింది. ఈ నెల 12న విద్యార్థి అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నాడు.
విద్యావకాశాలు, శిక్షణ ద్వారా భవిష్యత్తు తరం నాయకులను తీర్చిదిద్దే జాతీయ స్వచ్ఛంద సంస్థ డెక్స్టేరిటీ గ్లోబల్ అతడిని గుర్తించి.. తగిన మార్గదర్శకం చేసింది. ఈ నెల 12న వేదాంత్ అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నాడు. ఈ సందర్భంగా వైద్యశాస్త్రంలో వర్సిటీ ప్రపంచంలోనే 16వ ర్యాంకులో ఉందని, 17 మంది నోబెల్ పురస్కార గ్రహీతలను అందించిందని వేదాంత్ పేర్కొన్నాడు. అలాంటి వర్సిటీలో చదువుకునేందుకు ట్యూషన్ ఫీజు మేరకు స్కాలర్‌షిప్ లభించిందన్నారు. నాన్న ప్రైవేట్ ఆసుపత్రిలో దంత వైద్యుడిగా, అమ్మ ఫిజియోథెరపిస్ట్‌గా పని చేస్తున్నారని వేదాంత్ తెలిపాడు.