Case Registered Against Minister Ambati Rambabu: సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్కులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద అంబటిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంత్రి అంబటి నేతృత్వంలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో సత్తెనపల్లిలో వైసీపీ నేతలు టికెట్లు అమ్ముతున్నారని, జనసేన నేతలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..?! - andhra pradesh latest news
Case Registered Against Minister Ambati Rambabu: ఏపీలో మంత్రి అంబటి నేతృత్వంలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో సత్తెనపల్లిలో వైసీపీ నేతలు టికెట్లు అమ్ముతున్నారని, జనసేన నేతలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్టేషన్‌లో కేసు నమోదు చేయకపోవడంతో గుంటూరు కోర్టులో జనసేన జిల్లా అధ్యక్షుడు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తక్షణమే కేసు నమోదు చేసి, విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.
Minister Ambati Rambabu
పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో గుంటూరు కోర్టులో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై విచారణ జరిపిన కోర్టు.. మంత్రి అంబటిపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: