కరోనా రోగికి చికిత్స అందించిన జీవన్ సాయి ఆస్పత్రిపై కేసు - CASE REGISTERED AGAINST JEEVAN SAI HOSPITA
19:35 April 28
కరోనా రోగికి చికిత్స అందించిన జీవన్ సాయి ఆస్పత్రిపై కేసు
నిబంధనలకు విరుద్ధంగా కరోనా రోగికి చికిత్స అందించిన ప్రైవేటు ఆసుపత్రిపై కేసు నమోదైంది. హైదరాబాద్ వనస్థలిపురం జీవన్ సాయి ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా బాధితుడికి చికిత్స అందించారని జీవన్ సాయి ఆస్పత్రిపై స్థానిక భాజపా నేత పోచంపల్లి గిరిధర్ ఫిర్యాదు చేశారు. కరోనా లక్షణాలతో వచ్చిన వ్యక్తికి 6 రోజుల పాటు చికిత్స అందించినట్లు గిరిధర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో రోగికి చికిత్స అందించినట్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.