మనుషులను అపహరిస్తున్నారంటూ తప్పుడు వార్తలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న ముగ్గురిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మోతీనగర్‌కు చెందిన గురిజాల వెంకట్, కొత్తగూడెంకు చెందిన క్రాంతి కిరణ్ నాయుడు, మహబూబ్‌నగర్‌కు చెందిన బాలరాజు తప్పుడు వార్తలు ప్రసారం చేసినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో కేవలం ఒక్క రోజులో 82 మంది అపహరణకు గురయ్యారని భయానక వాతావరణం సృష్టించేలా వార్తలు ప్రసారం చేస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ముగ్గురు వ్యక్తులు తెలంగాణ యువ సైన్యం పేరుతో ఈ వార్తలను ప్రసారం చేస్తున్నట్లు తెల్చారు. ఎవరైనా ఇలాంటి తప్పుడు వార్తలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సంయుక్త కమిషనర్ అవినాశ్ మొహంతి స్పష్టం చేశారు.
మనుషుల అదృశ్యం వదంతులు: ముగ్గురి అరెస్టు - మనుషుల అదృశ్యం వదంతులు: ముగ్గురి అరెస్టు
తెలంగాణలో కలకలం రేపుతున్న మనుషుల అదృశ్యంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ యువ సైన్యం పేరుతో ముగ్గురు వ్యక్తులు ఈ వార్తలను ప్రసారం చేస్తున్నట్లు తేల్చారు.
![మనుషుల అదృశ్యం వదంతులు: ముగ్గురి అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3553707-220-3553707-1560449440120.jpg)
మనుషుల అదృశ్యం వదంతులు: ముగ్గురి అరెస్టు