తెలంగాణ

telangana

ETV Bharat / state

సాహో నిర్మాతలపై మాదాపూర్​లో కేసు నమోదు - సాహో చిత్ర నిర్మాతలపై కేసు

సాహో చిత్ర నిర్మాతలపై హైదరాబాద్​ మాదాపూర్​ ఠాణాలో కేసు నమోదైంది. తమ కంపెనీ పేరు సినిమాలో వాడతామని చెప్పి సుమారు కోటిన్నర వరకు మోసం చేశారని యూవీ క్రియేషన్స్​పై ఓ కంపెనీ ఫిర్యాదు చేసింది.

CASE ON SAHOO MOVIE PRODUCERS(UV CREATIONS) IN HYDERABAD

By

Published : Oct 17, 2019, 11:37 PM IST

ప్రభాస్​ హీరోగా నటించిన సాహో చిత్ర నిర్మాతలపై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్​స్టేషన్‌లో కేసు నమోదైంది. తమ కంపెనీ పేరును సినిమా సన్నివేశాలలో ప్రదర్శిస్తామని నమ్మించి మోసం చేశారని యూవీ క్రియేషన్స్​ బ్యానర్​పై... ఆర్క్​టిక్​ ఫాక్స్​ బ్యాగ్స్​ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు రూ.కోటిన్నర మేర సాహో నిర్మాతలు తమను మోసం చేశారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సాహో నిర్మాతలపై మాదాపూర్​లో కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details