తెలంగాణ

telangana

ETV Bharat / state

సచివాలయం కూల్చివేతపై తీర్పు రిజర్వు - సచివాలయ భవనాల కూల్చివేత కేసు

సచివాలయ భవనాల కూల్చివేతకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. సచివాలయ కూల్చివేతపై పలువురు నేతలు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

Case of demolition of secretariat buildings Judgment in reserve
సచివాలయం కూల్చివేత కేసు... రిజర్వులో తీర్పు

By

Published : Mar 6, 2020, 7:55 PM IST

సచివాలయం భవనాల కూల్చివేతలపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తెజస ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకుడు పద్మనాభ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ పూర్తయింది. ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. ప్రస్తుత అవసరాలకు సచివాలయం సరిపోవడం లేదని.. మరమ్మతులు చేయడం సాధ్యం కాదని.. కొత్త భవనాలు నిర్మించాలని ఇంజినీర్ల కమిటీ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు.

నిర్మాణ ప్లాను, నిధులు ఎంత అవసరమనే కనీస వివరాలు లేకుండానే కేబినెట్ నిర్ణయం తీసుకోవడం సహేతుకం కాదని ఇవాళ న్యాయవాది రచనా రెడ్డి వాదించారు. పాలసీలు సహేతుకంగా లేనప్పుడు కోర్టులు న్యాయ సమీక్ష చేయవచ్చునని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

ఇదీ చూడండి:వృద్ధి రేటు భయాలతో రూపాయి భారీ పతనం

ABOUT THE AUTHOR

...view details